KKD: తుని పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన రెండు రేషన్ దుకాణాలపై 6A కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ CI గోపాలకృష్ణ తెలిపారు. విజిలెన్స్ MRO విజయ్ కుమార్‌తో కలిసి గురువారం పట్టణంలోని పలు రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు దుకాణాల్లో స్టాక్ తేడాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో MSO నాగబాబు, VROలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తునిలో రేషన్ షాపులపై కొరడా!


