హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్ మండపాలపై ఎస్పీ కీలక సూచనలు

KKD: గణేశ్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలోనే అనుమతి తీసుకోవాలని SP బిందుమాధవ్ గురువారం సూచించారు. నిర్వాహకులు ganeshutsav.net వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద భద్రత కోసం రాత్రివేళ ముగ్గురు సభ్యులు లేదా వాలంటీర్లు అక్కడే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో అయితే స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరన్నారు.