హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: పరవాడ మండలంలో పలు గ్రామాలకు ఈనెల 5వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పరవాడ, వాడచీపురుపల్లి, వెంకటాపురం, పెదముషిడివాడ గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.