హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాకు రానున్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్

NLR: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అలపాటి సురేశ్ కుమార్ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు అకాడమీ సెక్రటరీ కస్తూరి బాయి తెలిపారు. సెప్టెంబరు 5న జడ్పీ సమావేశ మందిరంలో, 6న కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లాకు చెందిన గ్రామీణ జర్నలిస్టులకు నిర్వహించే రిఫ్రెషర్ తరగతుల్లో ఆయన పాల్గొంటారు.