ATP: మంత్రి గుమ్మడి సంధ్యారాణిని మంత్రి సవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ST సబ్‌ప్లాన్ కింద పెనుకొండ నియోజకవర్గంలోని తండాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.3 కోట్లు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలోని తండాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
తండాల అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు విడుదల


