హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: పెనమలూరు మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ డి.విశ్వేశ్వరప్రసాద్ తెలిపారు. లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.