కోనసీమ: కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన ధంగేటి లక్ష్మీ ప్రసన్న (19) గత నెల 31న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అంగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరీష్ గురువారం తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 9440900770 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కాలేజీకి వెళ్తున్నానని వెళ్లిన యువతి అదృశ్యం


