హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎమ్మెల్యే అండ

అన్నమయ్య: సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని తెలిపారు. సమస్యను ప్రభుత్వం, ఇంధన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.