కృష్ణా: గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో నూజివీడు–గన్నవరం ప్రధాన రహదారిపై వ్యాపారులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రహదారి ఆక్రమణకు గురవుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గన్నవరం గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పోలీసులు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు


