హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర బెస్ట్ గెజిటెడ్ హెడ్మాస్టర్‌గా దేవేందర్ రావు

KMR: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ ఎస్. దేవేందర్ రావు రాష్ట్ర బెస్ట్ గెజిటెడ్ హెడ్మాస్టర్‌గా ఎంపికయ్యారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడంతో పలువురు అభినందించారు.