హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

అన్నమయ్య: ప్రజలకు భద్రతా భరోసా కల్పించేందుకు రాజంపేట పట్టణంలోని RS రోడ్డులో అర్బన్‌ CI నాగార్జున ఆధ్వర్యంలో గురువారం పోలీసులు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. ప్రధాన రహదారులు,రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు,కార్యకలాపాలపై నిఘా ఉంచారు. అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.