హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తి నూతన ఎక్సైజ్‌ సీఐగా రవీందర్ రెడ్డి

NGKL: కల్వకుర్తి ఎక్సైజ్‌ శాఖ నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన జిల్లెల వెంకట్‌రెడ్డి షాద్‌నగర్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటుసారా, బెల్లం, పటిక, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.