హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సమయంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత ఏసీపీ అనుమతి తప్పనిసరి అన్నారు. అలాగే డీజే సౌండ్పై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.