హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనుషులైతే చెత్త వేయకండి: ఫ్లెక్సీ నిరసన

SRD: సంగారెడ్డి 29వ వార్డు గొల్లెగూడెం రహదారిపై నిత్యం చెత్త పారబోస్తుండటంతో విసిగిపోయిన స్థానికులు డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. సూచనలు పట్టించుకోకపోవడంతో సదరు స్థలంలో తెల్ల ఫ్లెక్సీని కట్టారు. మీకు సిగ్గు, శరం ఉంటే.. మనుషులైతే ఇక్కడ చెత్త వేయకండి అంటూ రాసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారికి ఘాటుగా బుద్ధి చెప్పారు.