VKB: మైలారందేవరంపల్లిలో వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గల్లీల్లో కుక్కల గుంపులు తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుక్కకాటుకు పలువురు గాయపడి ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను కట్టడి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంపులుగా వీధికుక్కలు.. ప్రజల్లో భయం


