హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంపౌండ్ వాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB : ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన కాంపౌండ్ వాల్‌ను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. పాఠశాల ఆవరణ భద్రత, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు MLA తెలిపారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు.