హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

SRPT: ముత్యాలమ్మ జాతర నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీఐ చరమంద రాజు, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పాత నేరస్థులు, గంజాయి సేవించేవారు, ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.