హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎయిరిండియాకు మరో రూ.10 వేల కోట్లు

ఎయిరిండియాలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధులతోపాటు టాటా సన్స్ పలు నిబంధనలు విధించింది. నిధులు కోరే సమయంలో ఎయిరిండియా స్పష్టమైన వ్యాపార ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది. టాటా సన్స్ ఎయిరిండియాలో ఈక్విటీ పెట్టుబడులను నిలిపివేసిన ఏడాదికి పైగా గడిచిన తర్వాత ఈ తాజా ఆమోదం లభించింది.