MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కురవిలో నిర్వహించిన నిరసనలో ఆమె పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం'


