SRD: కంగ్టి మండల సర్వసభ్య సమావేశంలో ఎరువుల విక్రయాలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించే ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మండల అధికారులను ఆదేశించారు. మండలంలో ఎరువుల కొరత లేదని ఏవో హరీష్ పవర్ తెలిపారు.
తెలంగాణ
అధిక ధరకు అమ్మితే సీజ్ చేయండి : ఎమ్మెల్యే


