హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

NZB: నగరంలోని నవ్యభారతి గ్లోబల్‌ పాఠశాలలో నేడు ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చిన్నారులు పాఠశాల ప్రాంగణంలో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాఠశాల చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌, కరస్పాండెంట్‌ శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.