హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాన్‌షాపుల్లో మత్తు చాక్లెట్లు

MDCL: నగరంలో మత్తు దందా కొత్త రూపం సంతరించుకుంది. గంజాయి కలిపిన చాక్లెట్లను పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి పాన్‌షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసు, ఎక్సైజ్‌ దాడుల్లో బయటపడింది. చాక్లెట్‌ ముసుగులో యువతను మత్తుకు బానిసలుగా మార్చే ముఠాలపై అధికారులు నిఘా పెంచారు.