హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం

ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం పాము కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. పామును గమనించిన గ్రామస్థులు దాన్ని బయటకు తరలించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో తరచూ పాములు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.