హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావు సభకు పకడ్బందీ ఏర్పాట్లు

ASF: ఈనెల 4వ తేదీన BRS పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కౌటాల మండలానికి రానున్నారు. ఈ సందర్భంగా కౌటాలలో సభా స్థలాన్ని సిర్పూర్ మాజీ MLA కోనేరు కోనప్ప గురువారం పరిశీలించారు. సమావేశానికి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక నాయకులకు సూచించారు.