హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిపురంలో కోతులు స్వైర విహారం ( VIDEO)

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో కోతుల బెడద తీవ్రమైంది. గుంపులుగా ఇళ్లపైకి ఎక్కి వస్తువులను ధ్వంసం చేయటమే కాకుండా, ప్రజలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. పొలాల్లో పంటలను నాశనం చేస్తూ రైతులను నష్టపరుస్తున్నాయి. కోతుల భయంతో పనులకు వెళ్లాలంటేనే గ్రామస్థులు వణికిపోతున్నారు. అధికారులు స్పందించి కోతులను బంధించి, విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.