ADB: గాదిగూడ మండలంలోని డోంగర్గావ్ గ్రామపంచాయతీ చిత్తగూడ అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం గోడలు, పైకప్పు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారులు వెంటనే పరిశీలించి నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరారు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనం


