హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన

WNP: సమాజంలో రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఎస్సై వి.జయన్న ప్రయాణికులను కోరారు. గురువారం ఆత్మకూరు బస్టాండులో ప్రయాణికులతో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని, గ్రామాలలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.