SDPT: చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ అకాల మరణం పట్ల ఉద్యమ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, సర్పంచ్‌గా, జడ్పీటీసీగా ప్రజాదరణ పొందారని కొనియాడారు. రవీందర్ మృతి ఆ ప్రాంతానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మాజీ జడ్పీటీసీ కన్నుమూత


