SDPT: విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ బెజ్జంకి మండలం కళ్లేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో సర్పంచ్ బిగుల్లా మోహన్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, పాఠశాల వసతులు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినీత్‌గౌడ్, వార్డు సభ్యులు ఉన్నారు.
తెలంగాణ
విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ: సర్పంచ్


