హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సదస్సు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ వారం రోజుల పాటు చేస్తున్న నిరసనల్లో భాగంగా రైతు సదస్సు నిర్వహించారు. పీఏసీఎస్ ఛైర్మన్ ఆడే సురేష్ మాట్లాడుతూ.. వెయ్యి రోజులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ చేసింది ఏమిలేదన్నారు. వెయ్యి రోజుల్లోనే అమాయక రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.