హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనం మొరాయింపుతో భారీగా ట్రాఫిక్‌

RR: శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌పై ఐకియా వైపు వెళ్లే మార్గంలో ఓ వాహనం మొరాయించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ వాహనదారులు సంయమనం పాటించి సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.