హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ వరదల్లో NRI కుటుంబం గల్లంతు

SRD: నేపాల్‌ వరదల్లో తెల్లాపూర్‌కు చెందిన NRI శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్ గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్ ద్వారా కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన వీరు గ్యిరోంగ్ వద్ద వరదలకు కొట్టుకుపోయినట్లు సంస్థ ధ్రువీకరించింది. గత నెల 26 నుండి ఆచూకీ లేకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూకే పౌరసత్వం ఉన్న ఈ కుటుంబం కోసం గాలిస్తున్నారు.