హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాయపర్తిలో గులాబీ శ్రేణుల రాస్తారోకో..!

WGL: రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రాయపర్తి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు.