హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యలు పరిష్కరించాలి: గండ్ర జ్యోతి

BHPL: టేకుమట్ల మండల కేంద్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం BRS ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. BRS BHPL జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు గిట్టుబాటు ధర, వడ్ల బోనస్, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.