BDK: భద్రాచలం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి పుష్పాంజలి సేవ నిర్వహించనున్నారు. పుష్పాలతో అర్చన, విశేష భోగ నివేదన, మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
భద్రాచలంలో పుష్పాంజలి సేవ


