హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

RR: శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామం నుంచి మోకిలా వెళ్లే రహదారిలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్‌ బస్సుల భద్రతపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.