హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చెట్టును నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

MNCL: చెన్నూర్‌లోని శివాలయం ప్రాంగణంలో ఉన్న సుమారు 200 ఏళ్ల రావి చెట్టును అనుమతులు లేకుండా నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గురువారం అటవీ, పోలీసు, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురాతనమైన రావి చెట్టును నరికి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేయడం హేయమేన చర్య అన్నారు.