హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసన

SDPT: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, సంత్‌ రవిదాస్‌ చిత్రపటాలపై నల్లరంగు చల్లిన ఘటనతో పాటు కార్యకర్తలపై దాడికి నిరసనగా బెజ్జంకిలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.