ప్రకాశం: కనిగిరిలోని గార్లపేట రోడ్డులో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. బాబాకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పట్టణంలోని భక్తులు ఆలయానికి తరలివచ్చి, బాబాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు, స్వామివారి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కనిగిరిలో వైభవంగా సాయినాధునికి పూజలు


