ASR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్' నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ కోసం రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నమోదు ద్వారానే ఎరువులు ఇస్తారు. రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి అందుబాటులోకి ఫెర్టిలైజర్ యాప్


