కోనసీమ: ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి వద్ద బుధవారం జరిగిన బైక్ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న జనసైనికుడు అడపా మల్లేష్ బాజీ (27)ని ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
చికిత్స పొందుతూ జనసైనికుడు మృతి


