హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RTC బస్సుల్లో పేరుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్.. లోపల నిల్!

VZM: 'ప్రయాణం సురక్షితం' అని చెబుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత నేడు ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు విజయనగరం బస్సుల్లో దుమ్ముపట్టి కనిపిస్తున్నాయి. ఉన్నచోట కాలంచెల్లిన మందులు ఉంటున్నాయి. మందుల కోసం కేటాయించిన నిధులు ఏమవుతున్నాయనేదీ ప్రశ్నార్థకమే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.