హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా..!

కృష్ణా: కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి వాటర్ ట్యాంకరుతో త్రాగునీరు సరఫరా చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనతో కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు గురువారం ఉదయం చింతకోళ్ల గ్రామానికి నాలుగు వేల లీటర్లు సరఫరా చేశారు. సాయంత్రం కూడా నాలుగు వేల లీటర్ల త్రాగునీరు సరఫరా చేయనున్నారు. వారం రోజుల నుంచి క్రమం తప్పకుండా త్రాగునీరు అందిస్తున్నారు.