నెల్లూరు: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కృష్ణాష్టమి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ఉట్టి మహోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పెంచలకోనలో కృష్ణాష్టమి వేడుకలు


