హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆహార సరఫరాలో నిబంధనలు పాటించాలి'

కృష్ణా: అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ. లక్ష్మీరెడ్డి ఆదేశించారు. గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు గురువారం నిర్వహించారు. అంగలూరు అంగన్‌వాడీలో భౌతిక, ఆన్‌లైన్‌ హాజరులో వ్యత్యాసంపై విచారణకు ఆదేశించారు.