హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు కృష్ణాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని గురువారం ఉదయం అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరిని అలరించారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి విశిష్టత గురించి పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు.