కడప: సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వీరారెడ్డి బుధవారం పరారయ్యాడు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన అతడు దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. మరో దొంగతనం కేసులో PT వారెంట్‌పై రాయచోటి కోర్టులో హాజరుపరిచి తిరిగి కడప సబ్‌జైలు వద్దకు తీసుకురాగా, లోపలికి వెళ్లే సమయంలో తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కడప జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్.!


