హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: అధ్యక్షుడు

ATP: అనంతపురం ద్వారకా నగర్ మండల బీజేపీ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఆనంద్ అధ్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షుడు రాజేష్, జిల్లా ఇన్‌చార్జి చంద్రప్ప హాజరై మాట్లాడారు. మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.