TPT: తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడులో 38 సెంట్ల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నారాయణవనానికి చెందిన సుబ్రహ్మణ్యం, ఎస్బీ పురానికి చెందిన వెంకటరమణను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుడు పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్.. మరో ఇద్దరు అరెస్ట్


