హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిస్సయిన బాలురు క్షేమం!

సత్యసాయి: ధర్మవరం తుంపర్తిలో తండ్రి రమేశ్ మందలించడంతో ఆయన ఇద్దరు కుమారులు ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. రూలర్ పోలీస్ స్టేషన్లో రమేశ్ ఫిర్యాదు చేయగా.. రూరల్ ఎస్సై రాజశేఖర్ కేసు దర్యాప్తు చేపట్టారు. పిల్లలు దినేశ్, ఆర్యన్ తిరుపతికి వెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.